దుర్కిలో హరినామ సంకీర్త..

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి శ్రీ సోమా లింగేశ్వర ఆలయంలో మంగళవారం అధికమాస సందర్భంగా అఖండ హరినామ సప్తను ప్రారంభించారు. ఈ సప్త కార్యక్రమం ఒక్క నెల రోజుల పాటు సంకీర్త కార్యక్రమం కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. అఖండ హరినామ సప్తా అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వ హిస్తారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరూ వేకువజాముననే ఆలయా నికి వెళ్లి కాగడ హారతిలో పాల్గొంటారు.దుర్కి శివారులో వెలసిన స్వయం భులింగేశ్వర ఆలయ సందర్శించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ కార్యక్రమంలో రాములు మహారాజ్ మైనవార్కరి కిష్టాపూర్ సొసైటీ చైర్మన్  శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పిటిసి కిషోర్ యాదవ్, మహేందర్ రెడ్డి, పత్కరి విఠల్, శ్రవణ్ కుమార్, పిట్ల సాయిలు విఠల్, మహారాజ్, వీరేశం నాందేవ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love