దోస్త్ 2023 స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలన..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశనికి (దోస్త్ 2023) స్పెషల్ కేటగిరి కి సంబంధించిన పిహెచ్/సిఎపి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 8 నుండి తెలంగాణా యూనివర్సిటీ లోని పరిపాలన భవనంలోని డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వెరిఫికేషన్ కు హాజరుకావాలని తెలంగాణ యూనివర్సిటీ దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సంపత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అదేవిధంగా NCC /Extra curricular Activities కలిగిన విద్యార్థులు ఈనెల 9వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని తెలిపారు. వెరిఫికేషన్ కు వచ్చే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు అదనంగా మరో రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని కోఆర్డినేటర్ తెలిపారు. పూర్తి వివరాలకు www.telanganauniversity.ac.in వెబ్ సైట్ ని సంప్రదించాలని కోరారు.

Spread the love