యూనిఫామ్స్ తయారీలో నాణ్యత పాటించాలి: డీఆర్డీఓ

– డీఆర్డీఓ జయదేవ్ ఆర్య హెచ్చరిక 
– కుట్టు కేంద్రంలో యూనిఫామ్స్ పరిశీలన 
నవతెలంగాణ – బెజ్జంకి 
పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందదించే యూనిఫామ్స్ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఆర్డీఓ జయదేవ్ జయదేవ్ ఆర్య అధేశించారు.గురువారం మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ తయారీ కుట్టు కేంద్రాలను డీఆర్డీఓ అకస్మికంగా సందర్శించి యూనిఫామ్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. మండలంలోని 34 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 2186 మంది విద్యార్థులకు ఒక్కొక్క జత యూనిఫామ్స్ అందించేల ఎనిమిది మహిళ కుట్టు కేంద్రాల్లో తయారీ చేయడానికి అందించామని మరో జత అందించడానికి ప్రభుత్వం నుండి వస్త్రం అందుబాటులోకి రాలేదని డీఆర్డీఓకు ఏపీఎం నర్సయ్య వివరించారు.సూపరిండెంట్ అంజయ్య,సీసీలు పాల్గొన్నారు.
Spread the love