సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి డీఎస్సీ-2008 అభ్యర్థులు

DSC-Studentsనవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి డీఎస్సీ-2008 అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం కామన్‌ మెరిట్‌లో ఎంపికై నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఆరు వారాల్లో పోస్టులను భర్తీ చేయాలని గతంలో హైకోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభ్యర్థులు వాపోయారు. న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.

Spread the love