కాంగ్రెస్ పార్టీలో చేరిన దూపల్లి దళిత వాడ ప్రజలు

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం

నవతెలంగాణ – రెంజల్ 
గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్, పార్టీలో అధికారంలో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని రెంజల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండలం దూపల్లి దళితవాడలో స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు ,బాబన్న, లు దళిత సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 50 మంది కాంగ్రెస్ పాండవులను కప్పుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోవు కాలంలో రిజర్వేషన్లు తొలగిస్తామని బిజెపి ప్రయత్నం చేస్తుందని దీనివల్ల బడుగు బలహీన వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లె అవకాశం ఉందన్నారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ జీవన్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ధనుంజయ్, తాజా మాజీ సర్పంచులు శనిగరం సాయిరెడ్డి, ఎమ్మెస్ రమేష్ కుమార్, బాబన్న, మైనార్టీ జిల్లా సెక్రెటరీ హైమద్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవి, హైమద్ చౌదరి, బి రవి, శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love