పదేండ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ కు కులగణన గుర్తుకు రాలేదా?

Didn't BJP and BRS remember caste census during ten years of rule?– సర్వేకు ఇంటికి వచ్చే అధికారులకు సహకరించాలి..

– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
10 ఏళ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో కులగణన గుర్తుకు రాలేదా అని ? ఈనెల 6న చేపట్టే కులగనన సర్వేకు ఇంటికి వచ్చే అధికారులకు పూర్తి వివరాలు అందజేసి ప్రతి ఒక్కరు సహకరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్ఎల్జి ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ పదేళ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఆ ఆ పాత బకాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఆడపిల్ల భారం కాబట్టి ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పేరున ఒక లక్ష ఒక రూ.10016లను అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలెక్కించిన హామీలన్నీ చేసి చూపమన చెప్పని హామీలు కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, రెండువందల యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను  నిలుపుకుంటామని,2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేసామని ఇంకా కొందరు రైతులు మిగిలారని రెండు మూడు నెలల్లోపు వారందరికీ రుణమాఫీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
త్వరలోనే సర్వే పూర్తి అయిన వెంటనే డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, కుల ఘనన పూర్తయిన తర్వాత సంక్షేమ పథకాల అమలు తదితర వాటిపై ఒక నిర్ణయం తీసుకొని అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా చూస్తామన్నారు. ఒక్క 150 ఇళ్లకు ఒక టీంను ఏర్పాటు చేశామని, ఈ లెక్క తోనే భవిష్యత్తు ఆధారపడి ఉందని,ప్రతి ఒక్కరూ ఈ కులగణన సర్వే కు వచ్చే అధికారులకు పూర్తి వివరాలను అందజేయాలని బిజెపి, టిఆర్ఎస్ పదేళ్లుగా పాలించిన ఘనంగా చేయలేదని ఇది ఒక మంచి కార్యక్రమం అని కావాలనే కొందరు బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో నిరంతరయంగా విద్యుత్ సరఫరా కావడంతో మూడు నుండి నాలుగు లక్షల క్వింటల్లా వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని సన్న వరికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ను ఇప్పటికే ప్రకటించిందని రైతుల ఖాతరులు నేరుగా వేయడం జరుగుతుందన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆలస్యమైన ఇబ్బందులు పడొద్దని పేర్కొన్నారు. నాలుగు మండలాలకు మూడు కోట్ల 45 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి సహాయనిధి లో భాగంగా ఒక కోటి 45 లక్షల రూపాయలు చెక్కులను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, మోత్కూరి నవీన్ గౌడ్, డిసిసి డెలిగేట్ సుధాకర్, సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసని శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, ఎల్ఐసి గంగాధర్ డాక్టర్ శాదుల్ల, ధర్మ గౌడ్, డైరెక్టర్ రాజేశ్వర్, మోహన్ రెడ్డి, చైర్మన్లు రామచందర్ గౌడ్, చింతల కిషన్, బొక్క గంగాధర్, తో పాటు డిచ్పల్లి ధర్పల్లి సిరికొండ ఇందల్వాయి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Spread the love