నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు మానకొండూర్ పరిధిలోని అర్హులైన ఇండ్లు లేని నీరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని గురువారం కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు,కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులను ఉదయం 5:30 గంటలకు ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అంతం రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు దాసరపు నరేందర్, ఎలుక పెళ్లి సంపత్, కాంతాళ రాజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మందాటి జగ్గారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు బొడిగ నరేష్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బోడ తిరుపతిరెడ్డి, బూతు అధ్యక్షులు వీరస్వామి, శివారెడ్డి, తదితరులు ఉన్నారు.