అమెరికాలో భూకంపం వణికిన భవనాలు

అమెరికాలో భూకంపం వణికిన భవనాలు– న్యూజెర్సీలో రిక్టర్‌ స్కేల్‌పై 4.8 తీవ్రతగా నమోదు
వాషింగ్టన్‌: అమెరికా లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు న్యూజెర్సీ లో రిక్టర్‌ స్కేలుపై 4.8 తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పొరుగున ఉన్న న్యూయార్క్‌ నూ ప్రకంపనలు తాకినట్లు తెలిపింది. న్యూజెర్సీలోని వైట్‌హౌస్‌ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో భూకంపాలు అరుదని యూఎస్‌జీఎస్‌ పేర్కొంది. న్యూయార్క్‌లోని బ్రుక్లిన్‌లో భవనాలు కంపించాయని ఓ వార్తాసంస్థ పేర్కొంది.

Spread the love