బెంగాల్‌లో పీడీఎస్ స్కామ్‌పై చర్యలు
న్యూఢిల్లీ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన గోధుమలు దారిమళ్లాయన్న ఆరోపణలపై ఎన్నికలు జరుగుతున్న వేళ… పశ్చిమబెంగాల్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. కొల్‌కతా, బర్ధమాన్, హబ్రాలలో ఉన్న సరఫరాదారులు, ఎగుమతి దారులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. సాగర్ ఎంటర్ ప్రైజస్, ఆ సంస్థ యజమాని సుసాంతో సాహా, మరో కంపెనీ యజమాని పార్థ సాహా, మా అన్నపూర్ణ రైస్ కన్సర్ట్స్ : సైనాక్స్ అన్నపూర్ణ ఉద్యోగ్ ప్రయివేట్ లిమిటెడ్ : కేజి ఫుడ్ ట్రేడింగ్ యజమాని దౌలత్ రామ్ గుప్తా, కంచన్ సోమ్‌లకు ఈ స్కామ్‌తో సంబంధం ఉందని ఆరోపణలున్నాయని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఘోజడంగా ల్యాండ్ క స్టమ్స్ స్టేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, 2020 అక్టోబర్ 23న రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ప్రాథమికంగా దర్యాప్తును ప్రారంభించింది.
సంక్షేమ పథకాల కోసం ఉద్దేశించిన పీడీఎస్ గోధుమలను పెద్దఎత్తున దారి మళ్లించారని ఆరోపణలున్నాయి. సరఫరాదారులు, లైసెన్స్ పొందిన పంపిణీదారులు, డీలర్లు, మధ్యవర్తులతో కుమ్మక్కై, అనధికారిక మార్గాల్లో తక్కువ ధరలకు గోధుమలను సేకరించారని, సరఫరా చేయకుండా దారి మళ్లించి నిల్వ చేశారని ఈడీ అధికారులు తెలిపారు. నిందితులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), రాష్ట్ర ప్రభుత్వ ముద్రణ ఉన్న సంచులను తొలగించి, తిరగేసి నింపారని పేర్కొన్నారు.
ఎన్నికల వేళ ఈడీ సోదాలు
- Advertisement -
- Advertisement -



