గద్దర్ కు నివాళులర్పించిన నవతెలంగాణ ఇన్ చార్జి ఎడిటర్

నవతెలంగాణ – హైదరాబాద్
అక్షరాలనే ఆయుధంగా మలిచిన విప్లవ రచయిత, ప్రజాగాయకుడు గద్దర్‌ ఇకలేరు. ‘మీకు పాటనిచ్చి వెళ్తున్నానమ్మో’ అంటూ నింగికెసినారు. పొడుస్తున్న పొద్దుమీద పాటై వికసించిన ఆయన అస్తమించారు. తుపాకీ బుల్లెట్లకూ జడవని ఆయనను అనారోగ్యం ప్రజలకు దూరం చేసింది. ప్రజా యుద్ధంగీతం గద్దర్ కు నివాళులు అర్పించిన నవతెలంగాణ ఇన్ చార్జి ఎడిటర్ ఆర్.రమేష్, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ లు గద్దర్ కు నివాళులర్పించారు.

Spread the love