విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

– శిధిలావస్థలో వసతి గహలకు
– కొత్త భవనాలు మంజూరు చేయాలి
— ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై సతీష్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వికారాబాద్‌ జిల్లాలో నాలుగు రోజులు నుండి జీప్‌ యాత్ర ముగింపు కార్యక్రమం వికారాబాద్‌ ఎన్టీఆర్‌ చౌరస్తాలో నిర్వహించారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ వికారాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 8 వ తేదీ నుంచి జీపు యాత్ర ప్రారంభించినట్టు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై సతీష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో హాస్టల్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల డిగ్రీ కళాశాలలో జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలను నాలుగు రోజుల నుంచి సందర్శించామని వాటిలో ఉన్న సమస్యలను గుర్తించినట్టు తెలిపారు. రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌ ఫీజు, రియింబర్స్‌మెంట్‌, హస్టల్‌లో ఉన్న విద్యార్థులకు మెస్‌ కాస్మోటిక్‌ చార్జీలు ఇంతవరకు ఇవ్వలేదని పెరిగిన ధరల కనుగుణంగా విద్యార్థులకు కాస్మోటిక్‌ ఛార్జీలు ఇస్తున్నామని చెప్పి ఇంతవరకు దాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం లేదని విమర్శించారు. అదేవిధంగా జిల్లాలో స్కూల్స్‌, హాస్టల్స్‌ ఎస్సీ, ఎస్టీ బీసీ హాస్టల్స్‌ కూలిపోయే శిధిలావస్థలో ఉన్నాయని, దాంట్లో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తాండూరులో విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలైన టాయిలెట్స్‌ మరుగుదొడ్లు సరిగా లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇది ఒక తాండూరు ఏ గాక అన్ని ప్రాంతాల్లో ఇదే వాతవారణం నెలకొందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వాపోయారు. ప్రభుత్వం విద్యార్థులకు కేజీ నుండి పేజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు కేజీ నుండి ఫీజు వరకు ఉచిత విద్య అమలు చేయలేదని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పి సైతం ఇంతవరకూ అమలు చేయడం లేదని విమర్శించారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్స్‌, హస్టల్స్‌ను గుర్తించి ప్రభుత్వం వెంటనే కొత్త భవనాలను నిర్మించాలని కోరారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించని యెడల వికారాబాద్‌ జిల్లా కమిటీ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. జీపు యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ వికారాబాద్‌ జిల్లా మాజీ నాయకులు వెంకటయ్య, మల్లేశం, ఆర్‌ మైపాల్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, జిల్లా సహకార దర్శి రాజు, రాకేష్‌, మహిముద్దీన్‌, సిరియాల, శ్రీకాంత్‌, అబ్దుల్‌ తదితర విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు

Spread the love