ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య..

నవతెలంగాణ-హైదరాబాద్ : 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను బుధవారం విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ లో 64.19 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో పరిక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగా నిన్న సాయంత్రం వరకు మొత్తం ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌కు చెందిన సాయితేజ(17), అత్తాపూర్‌కు చెందిన హరిణి, అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, దొరగారి పల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తాగా రంగారెడ్డిలో ఓ బాలిక కూడా ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇప్పటి వరకు ఫలితాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 8 కి చేరగా.. ఇందులో అత్యధికంగా ఏడుగురు బాలికలే ఉన్నారు.

Spread the love