నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమా న్యాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన అధ్యక్షులుగా బొజ్జ సూర్య నారాయణ రెడ్డి, కార్య నిర్వాహఖ అధ్యక్షులుగా శ్రీధర్ రావు, పరమేశ్, ఉపాధ్యక్షులుగా నారాయణగౌడ్, రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా యాద రామ కృష్ణ, కోశాధికారిగా శంకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఆ సంఘం మాజీ అధ్యక్షులు ప్రకాశ్, గింజల రమణారెడ్డి, సుందర్‌రాజు, కార్య దర్శులు హరిస్మరణరెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని కార్యవర్గ ప్రతి నిధులు హాజరయ్యారు.