నవతెలంగాణ – ఆర్మూర్
యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల1న జిల్లా కేంద్రంలోని బీసీ బాయ్స్ హాస్టల్ లో జిల్లా విస్తృత ఇటీవల నిర్వహించగా, డివిజన్ కార్యదర్శి సిద్దాల నాగరాజుని యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ నిరంతరం విద్యారంగ సమస్యల పట్ల, ప్రజా సంఘ క్రమశిక్షణ పాటిస్తూ, నియమ నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలకు ఎల్లవేళలా రాష్ట్ర కమిటీ ప్రాతినిధ్యం ఇస్తుంది అని అన్నారు. ఇదే ఉత్సాహంతో పని చేస్తూ రాష్ట్ర కమిటీ నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ రాష్ట్రస్థాయి నుండి దేశ స్థాయికి ఎదిగేటువంటి కార్యకర్తలని మరి ఎంతోమందిని భవిష్యత్తులో తయారు చేసే విధంగా నా ఉద్యమ రూపకల్పన ఉంటుందని తెలియజేశారు. అలాగే ముఖ్యంగా జిల్లా లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే ప్రైవేట్,మోనో కార్పొరేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ధనదాహా ఆగడాలను ఎల్లవేళలా ఎండ కడుతూ విద్యారంగంలో సమూల మార్పు అభివృద్ధి వచ్చేంతవరకు అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు ..ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.