ఎండోమెంట్ అధికారి వేణును తక్షణమే సస్పెండ్ చేయాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ ఆలయాల్లో పలు ఆలయాలకు ఉమ్మడి ఇ.వో గా ఎన్నో ఏళ్లుగా తిష్ఠ వేసుకొని కూర్చున్న అవినీతి, అహంకార అధికారి వేణుఈ మధ్య మాస శివరాత్రి రోజున కంటేశ్వర్ ఆలయంలోని స్వామి వారి పుష్కరిణి లో సాక్షాత్తు దేవుడివిగ్రహాలకు అభిషేకాలు జరుగుతుండగా ఈ అహంకార ఈవో వేణు పుష్కరిణిలో జలకాలాట ఆడుతూ,ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. పూజారులు ఎంత చెప్పినా నేను ఎండోమెంట్ ఆఫీసర్ను నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే మీరు మధ్యలో రావాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను అని పూజారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. అవే నీళ్లతో దేవుడికి అదే సమయంలో అభిషేకం చేస్తున్నారు,ఇది మహా అపరాధమని తెలిసినా చేసేదేం లేక అర్చకులు,భక్తులు నోర్లు మూసుకున్నారు. ఇది ఎంతటి అహంకారం అని పటేల్ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు.ఇతను కేవలం తాను ఇ.వో ను అనే అధికార మదంతో మొత్తం దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలన్నింటినీ తన దోపిడీకి అడ్డాలుగా మార్చేశాడు.గుడికి వచ్చే సాధారణ భక్తులను బిచ్చగాళ్ల కన్నా హీనంగా చూడటం ఇతని నైజం అని మండిపడ్డారు. ఈ సందర్భంగా పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ..కేవలం వి ఐ పీ ల సేవలు, ఆలయాల వేడుకల్లో పెద్ద పెద్ద వాళ్ళు, అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం కోసం సామాన్య భక్తులను చిత్రహింసకు గురిచేయడం ఇతని నిత్య కృత్యం.భక్తుల పట్ల అమర్యాద, మహిళా భక్తులని కూడా చూడకుండా ఆలయంలో బూతులు మాట్లాడటం , తనను ప్రశ్నించిన వారిని, నిలదీసిన వారిని గుడికే రానీయకుండా చేస్తానని బెదిరించడం, ఏం చేస్కుంటావో చేస్కో అని దుర్భాశలాడటం ఇదే ఇతని పని.నీల కంటేశ్వర ఆలయ నూతన రథం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని,ఆ అవినీతి లో ప్రధాన సూత్రధారి ఇతనే అనేది ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల ఆవేదన.ఇతను గుడిలో జరిగే ధార్మిక కార్యక్రమాలను అడ్డుకుంటాడు, కనీసం దేవుని భజన కోసం వచ్చే భక్తులను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు.ఆలయాల అర్చకులను సైతం తన కింద పని చేసే కూలీలుగా చూస్తూ వారి పాండిత్యానికి సైతం గౌరవం ఇవ్వకుండా వారి మీద అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. ఇతడి ఈ అరాచకాలకు మెచ్చి ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఇతనికి నిజామాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ఆలయాలకు ఇతన్నే ఈ.వో గా నియమించారు.ఈ నియామకంతో ఇతని అవినీతి, అక్రమాలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కేవలం ఇతడి వల్ల రోజూ గుడికి వచ్చే భక్తులు ఎంతో మంది గుడికే వెళ్లడం మానేశారు. నీల కంటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే కిరాయిలు, ఆలయ ఆవరణలో ఉన్న అక్రమ నిర్మాణాలు,అక్రమ లీజులు వీటన్నింటిలో ఈ దుర్మార్గుడి పాత్ర ఉంది.కావున ఇలాంటి అవినీతి బకాసురుడిని వెంటనే సస్పెండ్ చేయాలని,ఇతడి హయాంలో వివిధ ఆలయాల్లో,ముఖ్యంగా కంటేశ్వర్ ఆలయంలో రథం నిర్మాణం సహా శివరాత్రి, రథ సప్తమి వేడుకల్లో జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీలను జడ్జి స్థాయి అధికారితో విచారణ చేయించి ఇతన్ని శ్వాశతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ప్రభుత్వాన్ని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ ,బంటు ప్రవీణ్, చైతన్య ,ధీరజ్, నాని, అనిల్, కదం ,బినయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love