గాలి విచినా..చినుకు రాలినా..

– గాలివానకు నిచిపోతున్న విద్యుత్ సరఫరా
– లూజ్ వైర్లతో అందకారంగా మారుతున్న పల్లెలు
నవతెలంగాణ – మల్హర్ రావు
చినుకు రాలినా..గాలి విచినా..మండలంలో విద్యుత్ సరఫరా నిలిసిపోయి గ్రామాలు అంధకారంగా మారుతున్నాయి. చిన్నపాటి గాలి,వానకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తుంటే మండలంలో మాత్రం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.ఎండాకాలంలో సాయంత్రం, రాత్రి సమయాల్లో గాలి వియడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.తీవ్ర ఉష్ణోగ్రతతో వినియోగదారులు జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిన ఎలాంటి మార్పు ఉండదని మండల ప్రజలు వాపోతున్నారు.
ఆరు సబ్ స్టేషన్లు, 1159 ట్రాన్స్ పార్మర్లు ఉన్నా..
మండలంలో 33/11 కెవి సబ్ స్టేషన్లు తాడిచెర్ల, మల్లారం,రుద్రారం, నాచారం, పెద్దతూoడ్ల,వళ్లెంకుంట తదితర గ్రామాల్లో మొత్తం ఆరు కేంద్రాలు,1159 ట్రాన్స్ పార్మర్స్ పని చేస్తున్న ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలి వాన తగ్గిన సబ్ స్టేషన్లలో పని చేస్తున్న ఆపరేటర్లు సకాలంలో సరఫరాను పునరుద్ధరణ చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.సబ్ స్టేషన్ల నుంచి గ్రామాలకు విద్యుత్ ను అందించే కరెంట్ స్తంభాలు, తీగలు చాలా ఏళ్ల కిందట వేయడం,విద్యుత్ స్తంభాల కింద చెట్లు, హరితహారం మొక్కలు చెట్లుగా మారి తిగలకు తగలడంతో కరెంట్ ట్రిప్పువుంటుంది.డిలతో ట్రాన్స్ కో అధికారులకు కూడా ఇబ్బందిగా మారింది.
తీగలను సరిచేయాలి: అక్కల బాపు యాదవ్ యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు 
లూజు వైర్లతోనే విద్యుత్ సమస్య ఎదురవుతోంది.ట్రాన్స్ కో అధికారులు ముందు విద్యుత్ తీగలను సరి చేయాలి.సబ్ స్టేషన్లకు ఫోన్ చేస్తే సిబ్బంది స్పందించడం లేదు.రాత్రి సమయంలో అంతరాయం ఏర్పడితే నిద్రకు రూరం కావాల్సి వస్తోంది.అధికారులు ఇకనైనా స్పందించి కరెంట్ సమస్య లేకుండా చూడాలి.
Spread the love