ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

Everyone should develop leadership qualities

– కార్యకర్తలకు అండగా ఉంటాం
– టీపీసీసీ సభ్యులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. విప్లవాత్మక మార్పు రాజకీయాలతోనే సాధ్యమనీ ప్రతి ఒక్కరూ నాయ కత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచిం చారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టాయని, యువత సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. అబ్దుల్‌ కలాంతో కలిసి లక్షాలాది మంది యువతకు ట్రైనింగ్‌ ఇచ్చినట్టు గుర్తు చేశారు. గతంలో కెఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడం లక్ష్యంతో పని చేస్తానని హామీనిచ్చారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా కాంగ్రెస్‌ లీడర్‌షిప్‌ కోసం కృషి చేసినట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజల రాజకీయలోకి రావడానికి తను శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కార్యాకర్తలకు తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి చేవెళ్ల పార్లమెంట్‌గా రావాలని పార్టీ నాయకులు, అభిమానులు కోరగా ఆయన స్పందిస్తూ…చేవెళ్లపై తనకు ప్రేమ ఉందనీ, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను ఆలోచిస్తానని, అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌, చేవెళ్ల, ముడిమ్యాల, గుండాల సొసైటీ చైర్మెన్లు దేవర వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, నక్క బుచ్చి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు, నియోజకవర్గ నాయకులు పామేన బీమ్‌ భారత్‌, షాబాద్‌ దర్శన్‌, పార్టీ మండల అధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ గుండాల రాములు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మధ్యల శ్రీనివాస్‌ మాజీ ఉపసర్పంచ్‌ టేకులపల్లి శ్రీనివాస్‌, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల అధ్యక్షుడు బండారి వెంకట్‌ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు పాటీ దామోదర్‌ రెడ్డి, పైండ్ల మధుసూదన్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సుశాంత్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, చేవెళ్ల గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love