Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకూలీల సభకు సర్వం సిద్ధం

కూలీల సభకు సర్వం సిద్ధం

- Advertisement -

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభకు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సిద్ధమైంది. వ్యవసాయ కార్మికుల గుండె చప్పుడు వినిపించడానికి సర్వం ముస్తాబైంది. శనివారం ప్రారంభం కానున్న మహాసభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ హాజరు కానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు శనివారం బహిరంగసబ, 21, 22వ తేదీల్లో ప్రతినిధుల సభ జరగనుంది. మూడ్రోజులపాటు జరిగే ఈ మహాసభకు పుర వీధులగుండా ఏఐఏడబ్ల్యూయూ సంఘం కటౌట్లు ఏర్పాటు చేశారు. జెండాలు, తోరణాలు కట్టారు. జెండాలు, కటౌట్లు, బ్యానర్లతో దారులన్నీ ఎరుపెక్కాయి. మాజీ సీఎం మాణిక్‌సర్కార్‌ ఫొటోతోపాటు ప్రజా సంఘాల నాయకుల ఫొటోలు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభదa్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అద్యక్ష కార్యదర్శులు ఎ.విజయరాఘవన్‌ బి.వెంకట్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, ఎంపీ శివదాసన్‌, ఏఐకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగయ్య, ఆర్‌.వెంకట్‌రాములుతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లతో జిల్లా ఎరుపెక్కింది. సంఘం జెండాలు, తోరణాలను పట్టణం అంతా అలంకరించారు.

ఏర్పాట్లలో దగ్గరుండి..
ఎంబీసీ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఏర్పాట్లను మాజీ ఎంపీ పి.మధు, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, మహాసభ నిర్వహణ కమిటీ కోశాధికారి ఏ.రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు భూపాల్‌, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మనాయక్‌, శ్రీరామ్‌నాయక్‌, సీఐటీయూ కార్యదర్శి కురుమూర్తి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కుర్మయ్య, వ్యకాస జిల్లా కార్యదర్శి కడియాల మోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ ప్రశాంత్‌ బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశ స్థలాలను పరిశీలించారు. విద్యుత్‌, మంచినీరు, టాయిలెట్లు, భోజనాల తదితర విషయాలలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని కార్యకర్తలకు, వాలంటీర్లకు సూచనలు చేశారు. బహిరంగ సభ, ప్రతినిధుల సభను దిగ్విజయం చేయడానికి ప్రజా సంఘాల నేతలు కృషి చేస్తున్నారు.

భారీ ర్యాలీ
జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి వచ్చే వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రధాన పురవీదుల గుండా ర్యాలీతో ఎంబీసీ మైదానానికి చేరుకుంటుంది. వ్యవసాయ కార్మికుల సమస్యలు, ఇబ్బందులు, కొత్త చట్టం వల్ల ఏర్పడబోయే సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు భవిష్యత్‌ కర్తవ్యాలు ఈ మహాసభలో చర్చించనున్నారు. రైతులు, కార్మికులతో కలిసి చేయబోయే ఉద్యమాలకు పిలుపునివ్వనున్నారు. రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోనున్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -