నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున కిసాన్ కేజీల అధ్యక్షుడు మరియు మండల అధ్యక్షుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుని విద్యార్థులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత పి. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలో చాలావరకు అభివృద్ధి జరిగిందని ఆయన హయాంలోనే మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా మోపాల్ మండల ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆయన హయాంలోనే పురోగతి పొందిందని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ జిల్లా అభివృద్ధి పురోగతికి ఆయన మరింత కృషి చేస్తున్నాడని ఎల్లప్పుడూ రైతుల సంక్షేమ గురించి ఆలోచించే మహానేత అని పేదల పెన్నిధిగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ అందరినీ సమన్వయ చేసుకుంటూ ఎంతసేపు ప్రజాక్షేమం గురించి ఆలోచించే గొప్ప నేత జన్మదినo కావున ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంకా రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని మండల ,జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున తము అందరం కోరుకుంటున్నామని ఆయన తెలిపాడు. అలాగే మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, గంగారెడ్డి, అనిత ప్రతాప్, జలంధర్ రెడ్డి బున్నే రవి, గోరుగంటి లింగన్న, కిరణ్ రావు, సతీష్ రావు , శ్రీనివాస్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.