గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్,కాటారం ఎక్సైజ్ సిబ్బంది డిటిఎఫ్ ఆధ్వర్యంలో మండలంలోని  ఆన్ సాన్ పల్లి, నాచారం గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు గుడుంబా నిర్వాహకులపై కేసులు నమోదు చేసి ఒక వ్యక్తిని  అదుపులోకి  తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే 40 లీటర్ల నాటుసారాయి,1950 లీటర్ల బెల్లం,చక్కెర పానకాన్ని ద్వంసం చేసినట్లుగా తెలిపారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు వి. శ్రీనివాస్, టి నరేందర్,రాజ సమ్మయ్య,బి కిష్టయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love