ట్రాయ్ పేరుతో ఫేక్ కాల్స్: అడిషనల్ డీజీ

నవతెలంగాణ – హైదరాబాద్ : టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) పేరుతో ఫేక్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఫోన్స్, సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయంటూ కాల్స్ చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని, గుర్తుతెలియని నంబర్లకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు.

Spread the love