నిజామాబాద్ పోలీస్ శాఖలో ఆగష్టు 31న వదవి విరమణ శనివారం చేశారు. ఆగష్టు నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. సి.హెచ్. బాల్ సింగ్ నాయక్, ఎస్.ఐ, సి.యస్.బి, నిజామాబాద్ గారు పోలీస్ శాఖలో (42) సం||ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు (జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటిరిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని మీరు డిపార్టుమెంటల్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లు కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎస్.ఐలు సంతోష్ రెడ్డి, సాయన్న, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.