రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న రైతులు

– ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన
–  ప్రధాన రహదారిపై ధర్నా నిలిచిపోయిన ట్రాఫిక్
నవతెలంగాణ – మంథని
ధాన్యం కొనుగోలులో అలసత్వాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంథని-పెద్దపల్లి రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించి ధర్నా చేపట్టారు. సుమారు 20 రోజులు కావస్తున్న మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు సక్రమంగా కాంటాలు పెట్టడం లేదని రైతులు ఆరోపించారు.తరుగు,వివిధ రకాల పేరిట తూకంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం ఎందుకని రైతులు మండిపడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అధికార పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను పట్టించుకోవడంలో విపలమయ్యారని రైతులు ఆరోపించారు.సుమారు రెండు గంటలపాటు ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖరీఫ్ సీజన్ సమయం దగ్గర పడుతున్న కొనుగోలు జరగకపోవడంతో మళ్లీ ఎక్కడినుండి పెట్టుబడులు తీసుకురావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి గింజ కోoటామని చెప్తున్న ప్రభుత్వం పాలకుల మాటలు ఏమైనావని రైతులు ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులకు రైతు సమస్యలు కనబడటం లేద అని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి రైతులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ యార్డు,కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తి అయ్యేదాకా ధర్నా విరమించలేదని రైతులు బీస్మించుకొని కూర్చున్నారు. మంథని పెద్దపెల్లి ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా నిర్వహించడంతో సంబంధిత అధికారులు, పోలీసులు చేరుకొని రైతులను శాంతింప చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా రైతులు చేపట్టిన ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

Spread the love