Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప సర్పంచుల ఫోరంకు సన్మానం 

ఉప సర్పంచుల ఫోరంకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-నసురుల్లాబాద్ 
బీర్కూర్ మండలంలో ఇటీవల ఎన్నికైన మండల ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గ సభ్యులకు శుక్రవారం మల్లాపూర్ గ్రామంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు అమ్ముల శేఖర్, ఉపాధ్యక్షుడు అట్కారీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి తుంగభద్ర అజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేశముఖ్ ప్రవీణ్‌లకు శాలువాలు కప్పి సన్మానించారు. గ్రామ అభివృద్ధికి ఉపసర్పంచులు సహాయ సహకారాలు అందించాలని. ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు నీరడి సాయిలు, మొసలి సాయిలు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -