Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: డా.హైమవతి

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: డా.హైమవతి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
జూన్ 28 (ఆదివారం) నుంచి జూన్ 30 (మంగళవారం) వరకు మండల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు శారాజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హైమవతి తెలిపారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది,పత్రికా విలేకరులు,ప్రజలు అందరూ కార్యక్రమంలో భాగస్వాములై పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలకు గతంలో పోలియో చుక్కలు వేసినప్పటికీ ఈ విడతలో కూడా తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -