- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ (మెండోరా)
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మెండోరా, బాల్కొండ, ముప్కాల్ ఎస్ఐ లు సుహాసిని, శైలేందర్, కిరణ్ పాల్ పాల్గొన్నారు.
- Advertisement -


