నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో వినాయక ఉత్సవాలను హిందూ సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవాలని కోరుతూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం అన్ని గణపతి మండపాల దగ్గరికి వెళ్లి నిర్వాహకులకు వినతి పత్రం అందజేశారు. హిందూ సాంప్రదాయ పద్ధతులు, పూజ విధానం తెలియజేశారు. గ్రామంలోని ప్రతి గణపతి నిమజ్జనం రాత్రి 12 గంటల లోపు ముగిసేలా ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రతి ఒక్క గణపతి కమిటీ దీని పైన దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు 1893లో బాలగంగాధర్ తిలక్ ప్రజలలో ఐక్యమత్యం కోసం, సంఘటితం చేయడానికి ప్రారంభించారని తెలిపారు.ఈ ఉత్సవాలు నేడు కొందరు యువత కేవలం వారి ఆడంబరాల కోసం, మిగతా వారికన్నా ఎక్కువ అనే భావనతో వికృత చేష్టలు, ఇతరులకు హాని కలిగించే స్థాయిలో డీజే శబ్దాలతో ఈ ఉత్సవాలు చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామంలో అధికారులు, ప్రజలు, యువకులు అందరు కలిసి సంప్రదాయ, కొంచెం వినోదమైన పద్దతిలో ఉత్సవాలు చేస్తే బాగుంటదని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఉట్నూర్ రాజశేఖర్, దొంతుల రమణయ్య, రేంజర్ల గంగాధర్, భోగ రామస్వామి, ఆమేడ నరేందర్, ఆమెటి శంకర్, దాత్రిక రాజకుమార్, ,పసుపుల చంద్రమోహన్, నాంపల్లి నర్సయ్య, అడిచర్ల రవీందర్, వెలిశాల వేణు, ఇడ్లీ రఘు, తదితరులు పాల్గొన్నారు.