గిరిజన మహిళకు ఆర్థిక స్వలంబన

– స్వయం ఉపాధి కోసం శిక్షణ
నవతెలంగాణ- తాడ్వాయి : ఆదివాసి గిరిజన మహిళ ఆర్థిక స్వలంబన కోసం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో ములుగు జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సమన్వయంతో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 90 మంది మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని నర్సాపూర్లో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పీవో అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఎపిఓ అంకిత్, నాబార్డ్ ఏజీఎం రవి చైతన్య, ఆర్డీవో నాగ పద్మజ లు మాట్లాడుతూ ఏజెన్సీలో దొరికే ఇప్పప్పు, చిరుధాన్యాల తో వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని, ఆహార పదార్థాలను తయారు చేసి ఈ ఆహార పదార్థాలను మేడారం జాతరలో స్టాల్ ల్లో  విక్రయించడం ద్వారా మహిళలు మహిళ సంఘాలు ఆర్థికంగా బలపడతారని అన్నారు. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల సభ్యులు క్రమ తప్పకుండ పొదుపుతో పాటు వివిధ రంగాలలో శిక్షణ పొంది ఉపాధి పొందాలని తద్వారా కుటుంబానికి మహిళలు ఆర్థికంగా తోడ్పడు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, డి ఆర్ డి ఓ బాలస్వామి, అంకంపల్లి సర్పంచ్ బట్టన్ సావిత్రి, మహిళా సంఘాల నాయకులు మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love