నవతెలంగాణ న్యూఢిల్లీ: ఢిల్లీ- ఆగ్రా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన ట్రక్కు ఆటోను ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. ఆగ్రా సమీపంలోని గురుద్వారా గురు కా తాల్ వద్ద ఆటో రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.