నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు ప్రధాని మోడీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నట్టు తెలుస్తోంది.