दिल्ली के मुखर्जी नगर में स्थित कोचिंग सेंटर में लगी भीषण आग, रस्सी के सहारे नीचे उतरे छात्र। #Delhi pic.twitter.com/BidpQZWV0J
— Versha Singh (@Vershasingh26) June 15, 2023
నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముుఖర్జీ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు కిటికీల నుంచి తీగలను పట్టుకుని కిందకు దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడగా.. మిగిలిన వారు సురక్షితంగా కిందకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు.