పూల కిరీటం !

పూల కిరీటం !పువ్వులను తెంపకండి !
బోడబోడగా శిలాజ దృశ్యం
విషాద కాండం !

చెట్ల పై పూలుంటేనే
పూర్తి చెట్టు విశ్వరూపం !
చిత్రకారుడు చిత్రించినా
ఫొటో గ్రాఫర్‌ క్లిక్‌ మనిపించినా
సంపూర్ణ వర్ణవర్ణంగా చెట్టు
భూమికే పూల కిరీటంలా అనిపిస్తుంది!
– కందాళై రాఘవాచార్య, 8790593638

Spread the love