చెలిమెలు

చెలిమెలునేనేమో
అన్నం ఉడికిందో లేదోనని
ఓ మెతుకును పట్టి చూసాను
రైతుకు చక్కిలిగింతలు పెట్టినట్లనిపించి
గిన్నె నిండా తెల్లగా నవ్వుతున్నాడు
భలే పెళ్ళిళ్ళు
అక్షింతలు వేసేదగ్గర
పేద్ద లైను
ఉడికిన అక్షింతలు తినే దగ్గర
పొడవైన నైలు
అన్నం తినకుండా
బడికొచ్చిన పిల్లాడికి
పుటాకార కటకం గురించి
టీచర్‌
ఎంత చెప్పినా అర్థం కావటం లేదు
చివరికి
నీ పొట్ట చూసుకోరా నాయనా
అదే గొప్ప ఉదాహరణ అన్నాడు
మన భవిష్యత్‌ భద్రత కోసం
తాత ముత్తాతలు
అన్ని దిక్కుల్లో
బందోబస్తుగా నిలిపిన
రక్షకభటులు
ఈ వృక్షాలు
కీచురాళ్ళది
మాంఛి అంపైరింగ్‌
నోట్లో విజిళ్ళతో
నైటంతా ఊదుతూనే
చీకటిని ఆటలాడిస్తున్నాయి
– నలిమెల భాస్కర్‌, 9704374081

Spread the love