రథోత్సవాలలో అన్నదాన కార్యక్రమం..

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు గురువారం శుక్రవారం రెండు రోజులు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో రెండు రోజులపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈనెల 23న గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నదాత సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయంలో అన్నదాత సంతోష్ మేస్త్రి శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో అన్న పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మండల కేంద్రంలోని అన్ని వాడల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాతకు ఆలయ కమిటీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Spread the love