కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణించాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.  ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో 11 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు.

Spread the love