ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు సహా 9 మంది సిబ్బంది వీలైనంత దూరం జీపులో వెళ్లారు. కాలినడకన సెలయేరు, కొండ దారులు దాటుతూ ఆ గ్రామంలో నివసించే శివలింగం (92) అనే ఓటరును కలుసుకున్నారు. వయసు మీదపడి మంచానికి పరిమితమైన శివలింగానికి ఓటు వేయాలనే సంకల్పం బలంగా ఉండటంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోలింగు సామగ్రితో బుధవారం ఉదయం ఆరింటికి బయలుదేరిన సిబ్బంది మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకున్నారు. శివలింగం ఇంట్లో మంచం పక్కనే పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. తన మనవడి సాయంతో ఓటు వేసిన శివలింగం పోలింగ్‌ సిబ్బందికి కన్నీటితో వీడ్కోలు పలికారు.

Spread the love