ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి ఎం.అడివయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)లో సవరణలు చేసి అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) ప్రయోజనాలను తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పేదల ఆహార భద్రత హక్కును కాలరాసే చర్యలను సహించబోమని, అంత్యో దయ రేషన్ కార్డులను రద్దు చేసే ప్రయత్నం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చ రించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద మంగళవారం ఎన్‌పీ ఆర్‌డీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. దేశంలో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థకు దూరంగా ఉన్నారని, అర్హుల సంఖ్యను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం దానిని తగ్గించే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం తగ్గిస్తున్నారని ప్రశ్నించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 35.5 శాతం మంది పిల్లలు ఎదుగుదల లోపంతో, 32.1 శాతం మంది తక్కువ బరువుతో, 67.1 శాతం మంది రక్తహీనతతో బాధప డుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార భద్రతను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం చట్టాన్ని బలహీనపరచడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కింద కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అందుతుండగా, దానిని ప్రతి వ్యక్తికీ 7 కిలోల చొప్పున మార్చాలన్న ప్రతిపాదన సరికాదని అన్నారు. దీనివల్ల ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, వికలాంగుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని గొప్పలు చెప్పే మోడీ.. ఆహార భద్రత చట్టానికి ఎందుకు సవరణలు చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. వికలాంగులు మందులు, పున రావాసం, సహాయక పరికరాలు, రవాణా తదితర అవసరాల కోసం అద నపు ఖర్చులు భరిస్తున్న నేపథ్యంలో అంత్యోదయ పథకం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ ప్రయోజనాలను తగ్గించడం రా జ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించడమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చ రించారు. జాతీయ పోషకాహార భద్రతా చట్టాన్ని బలోపేతం చేసి వికలాంగుల కుటుంబాలకు 35 కిలోల బియ్యాన్ని కొనసాగించాలని, అదనపు పోషకాహార సహాయం అందించాలని కోరారు. తీవ్ర వైకల్యం ఉన్నవారికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంత్యోదయ లబ్దిదారుల సంఖ్యపై పరిమితిని తొల గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, ఉపాధ్యక్షులు వి.ఉపేందర్, బి. స్వామి, సహాయ కార్యదర్శులు పి. బాలేశ్వర్, కె. కాశప్ప, వై. గంగాధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు సుల్తాన్ రమేష్, షాహిన్ బేగం, నాయకులు శివకు మార్, రజిత తదితరులు పాల్గొన్నారు.
ఆహార భద్రత చట్ట సవరణలు విరమించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



