– రూ.లక్ష రుణమివ్వాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
సభ్యులు పి ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వృత్తిదారులందరికీ రూ.లక్ష రుణమివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో బెల్లపు దుర్గారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ నియోజకవర్గానికి కేవలం 1200-1500 మంది వృత్తిదారులకు మాత్రమే రుణాలిస్తామంటూ సర్కార్ చెప్పటం సరికాదని తెలిపారు.అర్హత కలిగిన అందరికీ వాటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ వృత్తి సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకులు, వృత్తిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. తద్వారా రుణాల పంపిణీకి విధి విధానాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.