కాంగ్రెస్ లో చేరిన తెలంగాణ సాంస్కృతిక సంఘం బహరైన్ మాజీ అధ్యక్షులు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వేల్పుర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సంఘం బహరైన్ మాజీ అధ్యక్షులు సామ చిన్న రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి జీవన్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో సామ చిన్న రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.సామ చిన్న రాజారెడ్డి తోపాటు  బిఆర్ఎస్ పార్టీ నాయకులు జంగం హాజీ అలాల్, అశోక్, చింతకుంట భాస్కర్, మలాల్ తిరుపతి, సుద్దపల్లి చిన్నయ్య, గాదేపల్లి సాయిరాం, మరి కొంతమంది జీవన్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జీవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కొత్తగా పార్టీలో చేరిన వారికి  సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love