మహమ్మద్ తౌసిఫ్ హైమద్ కి ” పీహెచ్డీ ప్రధానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఫార్మసిటికల్ విభాగంలో  బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ నసీం ఆధ్వర్యంలో మహమ్మద్ తౌసిఫ్ హైమద్ కి ” ఇంపాక్ట్ ఆఫ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ హెవీ మెటల్స్ ఇన్ ఎడ్సెర్ప్షన్ ఆన్ నానో ఎడ్సార్బంట్ ఇన్ఫ్యూజ్డ్ విత్ నేచురల్ అక్కరింగ్ ఆర్గానిక్ యాసిడ్స్ ” అంశంపై పరిశోధన నిర్వహించి తెలంగాణ యూనివర్సిటీ కి సమర్పించారు.మూల్యాంకనం అనంతరం  బహిరంగ వైవా కు  ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్  జాదవ్ రామచందర్ ఉస్మానియా యూనివర్సిటీ  హాజరై సిద్ధాంత గ్రంథం పై పలు ప్రశ్నలు అడిగి  సంతృప్తి వ్యక్తం చేసి   పిహెచ్డి డిగ్రీ ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో  యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి, సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఆరతి, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శిరీష బోయపాటి,  డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love