యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీం సేవలు మరువలేనివి..

– రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ నసీం సేవలు యూనివర్సిటీ లో మరువలేమని ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నతమైన ఆలోచనలతో తెలంగాణ యూనివర్సిటీ లో అడుగుపెట్టి పారదర్శకమైన పరిపాలన కొనసాగించారని, పరిపాలనలో మచ్చలేని వ్యక్తిగా  నసీం  పదవీ విరమణ చేయడం  ఆనందంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి అన్నారు.తెలంగాణ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్  ప్రొఫెసర్ డాక్టర్  నసీం పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని  తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రొఫెసర్ నసిం కు  పూలమాల వేసి,శాలువా కప్పి,మెమొంటో ఇచ్చి ఘనంగా  సన్మానించారు.ఈ సన్మాన సభకు అధ్యక్షత వహించిన  టూ టా అధ్యక్షులు  డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ నసీం     విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్ గా,డీన్ గా అకాడమిక్ బాధ్యతలో పాటు ఆడిసెల్ డైరెక్టర్గా, కంట్రోలర్ గా  రిజిస్ట్రార్ గా యూనివర్సిటీ లో అంకితభావంతో పని చేశారని పేర్కొన్నారు.ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ చారి మరణించిన అనంతరం  ఆయన భార్య శ్రీవాణి కి  కారుణ్య నియామక ఉత్తర్వులను అందించారని ,  సెక్యూరిటీ గార్డు పవన్ తండ్రి ప్రమాదవశాత్తు చనిపోతే  పవన్ కు  ఔట్సోర్సింగ్ లో  ఉద్యోగం ఇచ్చి  ఆ కుటుంబానికి అండగా నిలబడ్డరని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నసీం పదవీ విరమణ  సన్మాన సభకు  ముఖ్యఅతిథిగా  రిజిస్ట్రార్ ప్రొఫెసర్.ఎం. యాదగిరి పాల్గొని మాట్లాడుతూ ప్రొఫెసర్ నసీం సేవలు ఎల్లప్పుడూ యూనివర్సిటీ మరువలేమని ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నతమైన ఆలోచనలతో యూనివర్సిటీ లో  అడుగుపెట్టి పారదర్శకమైన పరిపాలన కొనసాగించారని, పరిపాలనలో మచ్చలేని వ్యక్తిగా  నసీం పదవీ విరమణ చేయడం ఎంతగానో  ఆనందంగా ఉందని తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిలో తన శక్తి వంచన లేకుండా  అంకితభావంతో  ఎలాంటి ఒత్తిళ్ళకు తలగ్గకుండా యూనివర్సిటీ అభివృద్ధికి ఎనలేని  కృషి చేశారని పేర్కొన్నారు. బోధనలో  17 ఏళ్లలో  వందలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్ది  ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేశారని వివరించారు. పరిశోధక విద్యార్థులను  నూతన ఆవిష్కరణలతో  పరిశోధన కొనసాగించుటకు ప్రోత్సహించి అనేక నూతన విషయాలను  ఆవిష్కరించారని తెలిపారు. ఆ ఆవిష్కరణలు సమాజాభివృద్ధిలో  భాగం పంచుకుంటున్నాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో  తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ ఏ నాగరాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ నసీం ఆధ్వర్యంలో  పరీక్షల విభాగంలో  విప్లమాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయి గౌడ్ మాట్లాడుతూ నసీం సలహాలు సూచనలతో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో మౌలికమైన మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్  బికోజీ మాట్లాడుతూ  ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రెండు కేటగిరిలుగా ఉంటే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చి అందరిని ఒకే కేటగిరిగా అప్పటి రిజిస్ట్రార్ నసీం మార్చారని తెలిపారు.
అకడమీక్ కన్సల్టెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ దత్తాహరి మాట్లాడుతూ అకాడమిక్ కన్సల్టెంట్స్ సమస్యలను  నసిం పరిష్కరించారని గుర్తు చేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో టూటా  వైస్ ప్రెసిడెంట్స్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి, సహాయ కార్యదర్శులు  డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమ, డాక్టర్ శిరీష  బోయపాటి  అధ్యాపకులు  డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ జెవేరియా, డాక్టర్ కె.వి రమణ చారి, డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి, డాక్టర్ పార్వతి, డాక్టర్ అబ్దుల్ కవి,డాక్టర్ స్వప్న,  డాక్టర్ స్రవంతి, డాక్టర్ అలీ ఖాన్, డాక్టర్ మహేందర్ ఐలేని, జ్యోతి, విజయలక్ష్మి, ఉమాదేవి, కాంట్రాక్టు టీచర్లు  తదితరులు ప్రొఫెసర్ నసిం సేవలను కొనియాడారు.సన్మాన గ్రహీత ప్రొఫెసర్ నసీం మాట్లాడుతూ  తెలంగాణ యూనివర్సిటీ లో టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థుల సహాయ సహకారాలతో నా వంతుగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు.తెలంగాణ యూనివర్సిటీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నా జీవితంలో మర్చిపోలేనని వివరించారు.
Spread the love