తీరం చేరిన టైటాన్‌ శకలాలు

నవతెలంగాణ – పోర్ట్‌లాండ్‌: అట్లాంటిక్‌ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక వద్దకు చేపట్టిన సాహసయాత్రలో పేలిపోయిన టైటాన్‌ జలాంతర్గామి శకలాలు తీరాన్ని చేరాయి. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ అండ్‌ లాబ్రడార్‌ ప్రావిన్సులో సెయింట్‌ జాన్స్‌ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చారు. జలాంతర్గామి పేలిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలక పరిణామం. టైటానిక్‌ను చూసేందుకు టైటాన్‌లో ప్రయాణించిన ఐదుగురూ మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే.

Spread the love