డిప్యూటీ స్పీకర్ బంధువునంటూ లక్షల్లో మోసం

నవ తెలంగాణ – బంజారా హిల్స్
ఎం ఎల్ ఎ, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ బంధువునని చెప్పి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో వసూలు చేసి మోసం చేశారని శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు ఆవేదన వ్యక్తపరిచారు. వారు మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ బంధువునని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. గత ఏడాది ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేస్తున్న యువకుడు ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఫెక్ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖకు వెళ్లి ఈ పత్రాలు చూపిస్తే ఇవి నకిలీ అని చెప్పడంతో మోసపోయినట్లు భావించిపలుమార్లు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు తీసుకోలేదు.లక్షల రూపాయలు వసూలు చేసి దర్జాగా తిరుగుతున్నారని తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆవేదన వెలిబుచ్చారు.

 

Spread the love