ఆలూరులో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళ

నవతెలంగాణ- ఆర్మూర్: జీవనన్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా లో బాగంగా దరఖాస్తు చేసుకున్న ఆలూర్ గ్రామ యువకుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం సంతోష్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ జీవన్ రెడ్డి యువత ఎదుర్కొంటున్న లైసెన్స్ సమస్యను పరిష్కరించడం కోసం ఆలోచించి స్వంత డబ్బులు వెచ్చించి లైసెన్స్ లు ఇప్పించడం గొప్ప విషయమని అటువంటి జీవన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, ఎంపీటీసీ మల్లేష్, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు రజనీకాంత్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నల్మెల మోహన్, వార్డు సభ్యులు గంగారెడ్డి, మహేష్, సత్యం, నల్లన్న, యూత్ నాయకులు క్రాంతి, సందీప్, సునీల్, సూర్య, నవీన్, ప్రదీప్, జాన్ పెద్ద ఎత్తున యువకులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love