Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాకాల వ్యాధుల నివారణకు కల్కినగర్‌లో ఉచిత వైద్య శిబిరం

వర్షాకాల వ్యాధుల నివారణకు కల్కినగర్‌లో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : వర్షాకాలం నేపథ్యంలో విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కల్కినగర్‌లో గురువారం ఉచిత వైద్య శిబిరం (హెల్త్ క్యాంపు) నిర్వహించారు.ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నరేందర్, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -