
– వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి..
నవతెలంగాణ – వేములవాడ
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ వేసవి ఉచిత శిక్షణా శిబిరాలకు వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ఆసక్తి కలిగిన 14 సంవత్సరాలు పైబడిన బాల,బాలికలు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 27, తేదీ నుండి 29 తేదీ సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న బాల బాలికలకు ఆయా క్రీడలలో నిపుణులు అయిన వ్యాయమ కోచ్ ల చేత వచ్చే మే నెల ఒకటో తేదీ నుండి ఆ నెల చివరి మే 31 వరకు(నెల రోజుల పాటు) వరకు వేములవాడ టౌన్ , కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం 06:00 గంటల నుండి 08:00 గంటల వరకు ఉచితంగా క్రింది క్రీడలపై శిక్షణా ఇవ్వడం జరుగుతుందని, శిక్షణా కు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కలిగించడం జరుగుతుందని వేములవాడ డిఎస్పీ తెలిపారు.1,వాలీబాల్,2,కబడ్డీ,3,పెయింటింగ్4,అబకాస్,5,కరేటే,6,యోగ,7,అర్చరీ,8,డ్యాన్స్,9,మార్షల్ ఆర్ట్స్,
10,అథ్లెటిక్స్,ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరానికి అవకాశాన్ని 14 సంవత్సరాలు పై బడిన బాల బాలికలు సద్వినియోగం చెలుకోగలరని డిఎస్పీ కోరారు.