కృష్ణాజివాడి అంగన్వాడి సెంటర్ లో మంచినీటి కొరత

  • ఇబ్బందులు పడుతున్న చిన్నారులు

నవతెలంగాణ తాడ్వాయి
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో అంగన్వాడి సెంటర్లో మిషన్ భగీరథ మంచినీరు రాక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాల పక్కనున్న అంగన్వాడి సెంటర్లో మిషన్ భగీరథ నల్ల నీళ్లు సరిగ్గా రాక విద్యార్థులు ఉపాధ్యాయులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు గతంలో చాలాసార్లు అంగన్వాడి సెంటర్లో సరైన మౌలిక వసతులు లేక సమస్యలపై మండల సర్వసభ సమావేశంలో పై అధికారులకు పలుమార్లు చెప్పిన.. ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం గ్రామపంచాయతీ సిబ్బంది అయినా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న గ్రామంలో ఉన్న అంగన్వాడి పాఠశాలలో టాయిలెట్, వాష్ రూమ్స్ , కరెంట్ లేక చీకటిలో , అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చిన్న పిల్లలకు పోషకాహారం కోసం వచ్చే బాలింతలకు ఇబ్బంది అవుతుందని అంగన్వాడి టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Spread the love