
పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొని పూజలు చేసి గణేష్ నిమజ్జనం చేసినారు ప్రజలు కూడా తమ ఇళ్లల్లో పూజించుకున్న గణేషుడికి కుటుంబ సభ్యులతో పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ సంవత్సరం అంతా ప్రజలకు మంచి జరగాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నామని చైర్ పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.