కోన సముందర్ లో వినాయకుడి లడ్డు వేలం పాట

Ganesha's laddu auction song in Kona Samundarనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ లో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద సోమవారం వినాయకుని లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో గ్రామానికి చెందిన సామా చిన్నారెడ్డి రూ.36వేల వేలం పాడి వినాయకుని లడ్డును దక్కించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడి చేతిలోని లడ్డు  వేలం పాటలో తనకు దక్కడం పట్ల సామ చిన్నారెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కాంతి సాయన్న, కోశాధికారి భూమన్న, కార్యదర్శి రాజా గంగారాం, దుంపల విజయ్ కుమార్, కొలిప్యాక  ఎల్లయ్య, ఎలిషాల భూమయ్య, చిమ్మటి నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love