మాదాపూర్ లో గడప గడపకు కాంగేస్ ప్రచారం

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం మాదాపూర్ గ్రామంలో  సోమవారం నాడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తీసుకొని వెళ్లడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో దాదాపుగా అన్ని పూర్తి చేశామని,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ ఆగష్టు 15 లోపు పూర్తి చేస్తారని గ్రామ మాజీ సర్పంచ్ జల్దేవార్ దినేష్ తెలియజేశారు. ఈ సంధర్భంగా దినేష్ మాట్లాడుతు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గారిని ఏ విధంగా అయితే మనం గెలిపించుకున్నామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ గారిని గెలిపించాలని ప్రజలను, ఓటర్లను కొరడం జరిగింది..అట్టి కార్యక్రమంలో మాదాపూర్ మాజీ సర్పంచ్ దినేష్, బాలాజీ పాటేల్, బాలు, గంగాధర్, శ్రీకాంత్, అస్పత్వార్‌‌ అరుణ్, గాయక్వడ్ విఠల్, లక్ష్మీకాంత్,అనిల్‌ అస్పత్వార్, పండరి తుదితరులు పాల్గొన్నారు.
Spread the love